Telugu Gateway
Cinema

‘కత్రినా’ సంచలన వ్యాఖ్యలు

‘కత్రినా’ సంచలన వ్యాఖ్యలు
X

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తనను ఒక్కరంటే ఒక్కరు కూడా ‘డేటింగ్’కు పిలవలేదని చెప్పారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, అనుష్క శర్మతో కలసి ఆమె నటించిన చిత్రం ‘జీరో’. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.‘నిజాయతీగా చెబుతున్నా. గత పదేళ్లుగా ఒక్కరు కూడా నన్ను డేటింగ్ కు రావాలని పిలవలేదు అని తెలిపారు. కత్రినా వ్యాఖ్యలపై షారుక్ ఖాన్ స్పందిస్తూ..ఇది చాలా విచారకరం. అయితే ఈ రోజు రాత్రి తాను ఢిల్లీలో నా నగరం ఢిల్లీలో డేటింగ్ కు తీసుకెళతానంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it