Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ పక్కన ఎవరు?

ఎన్టీఆర్ పక్కన ఎవరు?
X

ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న. ఓ వైపు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్నారు. పక్కనే ఓ అమ్మాయి కూడా ఉంది?. ఆమె ఎవరు?. ఈ కొత్త ఫోటోలు ఎక్కడివి. ఈ ఫోటోలను ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఈ ఫోటోలు ఎక్కడ..ఎందుకు దిగారా? అన్నదే కదా మీ డౌట్. అయితే ఆ వివరాలు ఏంటో మీరూ ఓ సారి చూడండి. లక్ష్మీ ప్రణతితోపాటు ఎన్టీఆర్ పక్కన ఉన్నది భావన జస్రా. ఆమెదే ‘ఫస్ట్ ఇంప్రెషన్స్’ అనే సంస్థ.

ఈ సంస్థ చేసే పని ఏంటి అంటే చిన్న పిల్లలకు చెందిన మధుర జ్ణాపకాలను భద్రపరుస్తారు. అది ఎలా అంటారా?. ఎంపిక చేసిన కెమికల్స్ ను వాడి ఈ ముద్రలను తయారు చేసి..ఆల్బమ్ గా తీర్చిదిద్దుతారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలసి భావన జస్రాకు ఇంప్రెషన్స్ ఇఛ్చారు. ఎన్టీఆర్ తన తనయులు అభయ్ రామ్, భార్గవ రామ్ లకు చెందిన ఇంప్రెషన్స్ ఇఛ్చారు. ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ కొత్త లుక్ లో గడ్డంతో కన్పించటంతో ఆర్ఆర్ఆర్ లో కన్పించే లుక్ కూడా ఇదేనంటూ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో పెట్టారు.

Next Story
Share it