Telugu Gateway
Politics

రాజకీయంగా ఎన్టీఆర్ మంచి పనిచేశారా?

రాజకీయంగా ఎన్టీఆర్ మంచి పనిచేశారా?
X

టాలీవుడ్ లో ప్రముఖ హీరో అయిన ఎన్టీఆర్ రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకున్నారా?. తాజా ఫలితాలు ఎన్టీఆర్ నిర్ణయం సరైనదే అని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివంగత హరికృష్ణ కుటుంబానికి ప్రాధాన్యత ఇఛ్చినట్లు చెప్పుకునేందుకు కూకట్ పల్లి బరి నుంచి నందమూరి సుహాసినిని బరిలో దింపారు. అయితే ఆమె తరపున ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ తోపాటు కళ్యాణ్ రామ్ కూడా వస్తారని తొలుత టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ తన సోదరి విజయం సాధించాలని ఆశిస్తూ మద్దతు లేఖ ఇచ్చిన సోదరులిద్దరూ ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు. షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా..వాస్తవానికి తన సోదరి ఎన్నికల బరిలో ఉండటమే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కు ఇష్టం లేదు.

టీఆర్ఎస్ హవాలో కూకట్ పల్లి బరిలో నిలుచున్న సుహాసిని ఓటమి పాలయ్యారు. ఆమె తరపున చంద్రబాబుతోపాటు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ, బాలకృష్ణ, ఏపీ మంత్రి పరిటాల సునీత వంటి వారు కూడా ప్రచారం చేశారు. అయినా సరే ఓటమినుంచి కాపాడలేకపోయారు. నిజంగా ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వచ్చి ఉంటే ఆయనపై కూడా ఈ ప్రభావం పడేది. చంద్రబాబు రాజకీయ వ్యూహాలను తెలుసుకున్న ఎన్టీఆర్ వ్యూహాత్మకంగానే ఈ ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన నిర్ణయం ఎంత కరెక్టో ఫలితాలు వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు.

Next Story
Share it