Telugu Gateway
Telangana

హరీష్ నివాసంలో ఈ హంగామా ఏంటి?

హరీష్ నివాసంలో ఈ హంగామా ఏంటి?
X

సడన్ గా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో ఈ హంగామా ఏంటి?. ఒక్కసారిగా ఎందుకు ఆయన అభిమానులు బారులు తీరి హైదరాబాద్ వచ్చారు. మంత్రుల క్వార్టర్లలో బారులు తీరిన కార్లు..వేలాది మంది అభిమానులు శనివారం ఉదయం నుంచి హరీష్ రావు నివాసానికి క్యూ కట్టారు. ఇది టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. శుక్రవారం నాడే సీఎం కెసీఆర్ తన తనయుడు,మాజీ మంత్రి కెటీఆర్ కు పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రకటన తర్వాత కెటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలసి వచ్చారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం వెనక కెసీఆర్, కెటీఆర్ లతోపాటు హరీష్ రావు కూడా కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మహాకూటమిపై వ్యతిరేక ప్రచారం చేయటంలో ఆయన అందరి కంటే ముందు ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అత్యంత కీలకమైన హోం, సాగునీటి శాఖలు టీడీపీకి చేతిలోకి వెళతాయని..అప్పుడు వాళ్లు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటారని ప్రచారం చేయటంతో ద్వారా ప్రజల్లో అనుమానాలు రేకేత్తించేలా చేయటంలో హరీష్ సక్సెస్ సాధించారు.

తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీష్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. గెలుపు అనంతరం ఆయన అక్కడే తన అభిమానులకు..కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అందరినీ స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపారు. కెటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన నేపథ్యంలో వేలాదిగా ఆయన అభిమానులు హైదరాబాద్ తరలిరావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతుంది. సహజంగానే హరీష్ రావు నిత్యం నియోజకవర్గానికి వెళుతూ అక్కడి ముఖ్యనేతలకు..ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాంటిది వేలాది మంది ఇలా హైదరాబాద్ బయలుదేరి ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది?.

Next Story
Share it