‘బాబా’ గెటప్ లో హన్సిక
BY Telugu Gateway10 Dec 2018 7:48 AM GMT

X
Telugu Gateway10 Dec 2018 7:48 AM GMT
అందాల భామ హన్సిక ఈ సారి బాబా గెటప్ లో కన్పిస్తోంది. ‘మహా’ సినిమా ద్వారా ఆమె కొత్త రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో గ్లామరస్ రోల్స్ కే పరిమితం అయిన ఈ భామ ఇప్పుడు రూట్ మార్చినట్లు కనపడుతోంది. ఆమె పరిశ్రమలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటింది. ఇన్ని సంవత్సరాల్లో ఈ తరహా పాత్ర చేస్తున్నది ఇదే తొలిసారి.
ఆమె గతంలో మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘విలన్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేశారు. ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మహా’. హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్. జెమిల్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఆదివారం విడుదల చేశారు.
Next Story