Telugu Gateway

గోవాలో విదేశీ మహిళపై లైంగిక దాడి

గోవాలో విదేశీ మహిళపై లైంగిక దాడి
X

ప్రస్తుతం గోవా అంతా బిజీ అంటే బిజీ. అసలే క్రిస్మస్ సందడి. మరో వైపు నూతన సంవత్సర వేడుకలకు గోవా ముస్తాబు అవుతోంది. ఈ సీజన్ లో గోవాలో ఎంజాయ్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ తరుణంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ విదేశీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి దిగాడు. బ్రిటన్ పర్యాటకురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం బీచ్‌ వద్దకు వెళుతున్న 48 సంవత్సరాల బ్రిటన్‌ పర్యాటకురాలిపై దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, లైంగిక దాడి అనంతరం ఆమె వస్తువులను అపహరించాడని పోలీసులు తెలిపారు.

పనాజీకి వంద కిలోమీటర్ల దూరంలోని కనాకొన పట్టణంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నేరానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని దక్షిణ గోవా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు పాలోలెమ్‌ బీచ్‌కు వెళుతుండగా అడ్డగించిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన నిందితుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పంటపొలంలోకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి దిగాడు. తర్వాత బాధితురాలికి చెందిన మూడు బ్యాగులను దొంగిలించి పారిపోయాడని పోలీసులు చెప్పారు.

Next Story
Share it