Telugu Gateway
Cinema

ఎఫ్2 టీజర్ వచ్చేసింది

ఎఫ్2 టీజర్ వచ్చేసింది
X

చ‌రిత్ర చెప్పాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటారు. అదే ఓ మ‌గాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు..పెళ్లికి త‌ర్వాత అని చెప్పాలంట‌. ఈ మాట ఎవ‌రు చెబుతున్నారో తెలుసా?. సీనియ‌ర్ హీరో వెంక‌టేష్. హీరో వ‌రుణ్ తేజ్ ఏమైనా త‌క్కువ తిన్నాడా?. ఆయ‌న కూడా అదే బాట‌లో ఉన్నారు. ఓ చ‌రిత్ర చెప్పాలంటే తెలంగాణ రాక ముందు..తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత అంటూ త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఫ‌న్నీ డైలాగులు అన్నీ ఎందులో అనుకుంటున్నారా?. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ జంట‌గా న‌టిస్తున్న ఎఫ్ 2 సినిమా టీజ‌ర్ లోనివే ఇవి.

పెళ్లి అయిన మ‌గాళ్ళ క‌ష్టాల‌పై ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ సినిమాలో వెంక‌టేష్ కు జోడీగా త‌మ‌న్నా..వ‌రుణ్ కు జోడీ మెహ‌రీన్ న‌టించారు. ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో నిలిపేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్ న‌వ్వులు పూయిస్తోంది.

https://www.youtube.com/watch?time_continue=76&v=otAcYFVFE7k

Next Story
Share it