Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి రావెల గుడ్ బై

తెలుగుదేశం పార్టీకి రావెల గుడ్ బై
X

ఎన్నికల ముందు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. కొద్ది కాలం క్రితమే చంద్రబాబు మంత్రివర్గం నుంచి రావెలను తప్పించి..గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనంద్ బాబుకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పార్టీ పట్ల అంటీముంటనట్లుగానే ఉంటున్నారు. అంతే కాదు..సొంత పార్టీ నేతలపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

రావెల టీడీపీనీ వీడతారనే విషయం ఆ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. టీడీపీకి గుడ్ బై చెప్పిన రావెల పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేనలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. గతంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి నియోజకవర్గంలో సభ నిర్వహించిన రావెల.. చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Next Story
Share it