Telugu Gateway

మరో వివాదంలో చింతమనేని..సినీ నటి ఫిర్యాదు

మరో వివాదంలో చింతమనేని..సినీ నటి ఫిర్యాదు
X

తెలుగుదేశం పార్టీలో ఆ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నంతగా మరెవరూ లేరంటే అతిశయోక్తి లేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని. ఈ మధ్యే ఓ టోల్ గేట్ దగ్గర తనను టోల్ అడిగారని..ఏకంగా కారును అక్కడే వదిలేసి వెళ్లి ఆయన వార్తల్లో ఎక్కారు. తాజాగా ఆయనపై సినీ నటి అపూర్వ విమర్శలు చేశారు. అంతే కాదు..ఏకంగా చింతమనేని అనుచరులు అని చెబుతున్న వారిపై కేసులు పెట్టారు. ‘టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు టార్గెట్ గా చేసుకొని నన్ను బెదిరిస్తున్నారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నారు.

ఓ యుట్యూబ్ ఛానల్ లో నేను చింతమనేని ని ఏదో అన్నానని బెదిరింపులు కి దిగుతున్నారు. గతంలో మా ఇంటి ముందు ఒక దిమ్మె కడుతున్న సమయంలో వ్యతిరేకించినందుకు నన్ను టార్గెట్ చేశారు. మా ఇద్దరి మధ్య గొడవలు రావడం తో నా భర్త తో విడాకులు తీసుకున్నాను. నా భర్త ను తీసుకొచ్చి నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు నలుగురు పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఆధారాలు పరిశీలించి భాద్యులు పై చర్యలు తీసుకుంటాం అన్నారు’ అని తెలిపారు.

Next Story
Share it