Telugu Gateway
Cinema

‘అనుష్క’ న్యూ లుక్ అదుర్స్

‘అనుష్క’ న్యూ లుక్ అదుర్స్
X

అనుష్క అసలు సినిమాలు చేస్తుందా?. ఇక పెళ్ళి పీటలు ఎక్కి సినిమాలకు గుడ్ బై చెబుతుందా?. ఇదీ గత కొంత కాలాంగా సినీ పరిశ్రమలో సాగుతున్న చర్చ. అనుష్క పెళ్లిపై నిత్యం ఏవో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. భాగమతి సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమా ఏదీ అంగీకరించకపోవటంతో ఇలాంటి చర్చలు చాలానే జరిగాయి. సుదీర్ఘ విరామం తర్వాత అనుష్క కొత్త లుక్ వచ్చేసింది. అది కూడా అదరగొట్టేలా ఉంది. మాధవన్ తో కలసి అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు కోన వెంకట్ కథ అందించారు. ఆయనే స్వయంగా తమ సినిమాకు సంబంధించిన అనుష్క కొత్త లుక్ ఫోటోను షేర్ చేసుకున్నారు.

ఈ లుక్ ఎంతో బాగుందని..ఇది అనుష్క కెరీర్ లో కూడా బెస్ట్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. నలభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. కొత్త సంవత్సరం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుందని చెబుతున్నారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు అనుష్క ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చాలా కాలం పాటు అనుష్క పెరిగిన బరువు తగ్గేందుకు కూడా నానా కష్టాలు పడ్డారు.

Next Story
Share it