Telugu Gateway
Top Stories

పదిహేడేళ్ల అబ్బాయి..26 ఏళ్ళ టీచర్ పరార్

పదిహేడేళ్ల అబ్బాయి..26 ఏళ్ళ టీచర్ పరార్
X

అమ్మాయికి 26 సంవత్సరాలు. అబ్బాయికి 17 ఏళ్లు. ఇద్దరూ పరార్ అయ్యారు. ఆమె టీచర్..అబ్బాయి స్టూడెంట్. పైగా ఆ అమ్మాయికి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి అయింది కూడా. ఉద్యోగం కోసం అని ఆమె భర్త చెన్నయ్ వెళ్ళిపోవటంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. తాను పనిచేసే ప్రైవేట్ ట్యూటోరియల్ లో టెన్త్ స్టూడెంట్ తో ఉడాయించింది. వివాహం అయిన నెల రోజులకే ఈ సంఘటన జరగటంతో ఆమె కుటుంబంతోపాటు..అబ్బాయి కుటుంబంలో కూడా కలకలం రేగింది.

గత నెల 19నే వీరి వివాహం జరిగింది. కోరిమేడులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు రోజులుగా గాలిస్తూ వచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో టీచర్ 17 ఏళ్ల బాలునితో మంగళవారం పోలీసుస్టేషన్‌కు జంటగా వచ్చింది. తాము కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీచర్‌కు, బాలుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి వారి తల్లిదండ్రుల వెంట పంపారు.

Next Story
Share it