Telugu Gateway
Politics

టీఆర్ఎస్ కు మరో షాక్

టీఆర్ఎస్ కు మరో షాక్
X

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇదే టీఆర్ఎస్ కు పెద్ద షాక్ అయితే...ఇప్పుడు మరో తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వికారాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసి 24 గంటల కూడా కాకముందే మరోనేత పార్టీని వీడడం గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి తీరు నచ్చకనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు సంజీరావు బుధవారం తెలిపారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి వికారాబాద్‌ నుంచి గెలిచిన సంజీవరావుకు ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది. టీఆర్‌ఎస్‌ తరఫున మెతుకు ఆనంద్‌ను ఈ సారి బరిలో నిలిపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంజీవరావు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్‌కి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ఆయన కూడా నడుస్తారనే వార్తలు వినివిస్తున్నా.. ఆయన మాత్రం ఏపార్టీలో చేరబోయేది తేలాల్సి ఉంది.

Next Story
Share it