తెలంగాణ టీడీపీ జాబితా ఇదే

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్ధులతో జాబితా ప్రకటించింది. ఇందులో ఎక్కువగా మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పేర్లే ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ సీట్ల విషయంలో పెద్దగా పట్టింపులకు పోకుండా 14 సీట్లతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ తొలి జాబితాలో 65 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయగా..టీడీపీ కూడా సోమవారం అర్థరాత్రే తొమ్మిది మంది అభ్యర్దుల పేర్లను వెల్లడించింది.
టీడీపీ తొలి జాబితా ఇదే..
ఖమ్మం: నామా నాగేశ్వర్‌రావు
సత్తుపల్లి: సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట: ఎం.నాగేశ్వర్‌రావు
వరంగల్ వెస్ట్: రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్: కొత్తకోట దయాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ఎర్ర శేఖర్
ఉప్పల్: తూళ్ల వీరేందర్ గౌడ్
శేరిలింగంపల్లి: భవ్య ఆనంద్ ప్రసాద్
మలక్‌పేట: ముజఫర్ అలీ ఖాన్