దుమ్మురేపుతున్న విజయ్ ‘ట్యాక్సీవాలా’ టీజర్

విజయ్ దేవరకొండ. ప్రస్తుతం యూత్ ను ఆకట్టుకుంటున్న కుర్ర హీరో ఇతగాడే. విజయ్ ఏ సినిమా చేసినా ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్ అవుతోంది. నోటా సినిమా కొంత మందిని నిరాశపర్చినా... విజయ్ నటించిన ‘గీత గోవిందం’ కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’ అంటూ ముందుకొస్తున్నాడు ఈ యువ హీరో. గతంలో ఏ సినిమాకు ఎదురుకాని రీతిలో విజయ్ ఈ సినిమా విడుదలకు సంబంధించి పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతిమంగా నవంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం నాడు విడుదలైన ట్యాక్సీవాల్ టీజర్ దుమ్మురేపుతోంది.
విడుదలైన 16 గంటల్లోనే 13 లక్షల వ్యూస్ సాధించింది. హారర్, కామెడీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్ మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆ టాక్సీతో విజయ్ జీవితంలో వచ్చిన యూ టర్న్స్ ని థియేటర్స్‌లో చూడాల్సిందే. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?v=9KN3dbZVRwQ