Telugu Gateway
Movie reviews

‘సవ్యసాచి’ మూవీ రివ్యూ

‘సవ్యసాచి’ మూవీ రివ్యూ
X

ఒక్కరిలో ఇద్దరు మనుషులు ఉంటారా?. అసలు ఇది సాధ్యం అవుతుందా?. ఓ స్త్రీ గర్భిణిగా ఉన్న సమయంలో సరైన పోషకాహారం అందక కవల పిల్లలు పుట్టాల్సిన తల్లికి ఒక్కరే పుడితే..ఆ రెండవ వ్యక్తికి సంబంధించిన శక్తి అంతా ఓ చేతికి చేరితే...ఎలా ఉంటుంది?. ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా రెండవ వ్యక్తి శక్తి మొత్తం చేరిన ఎడమ చేయి స్వతంత్రంగా పనిచేస్తుందా?. అలా చేస్తే ఎలా ఉంటుందో అదే ‘సవ్యసాచి’ సినిమా. ఈ సినిమాలో నాగచైతన్య ‘ఎడమ చేతి’కి అమేయమైన శక్తి ఉంటుంది. అతని ప్రమేయం లేకుండా ఆ చేయి అమ్మాయిలను ఆట పట్టిస్తుంది..శత్రువులను వేటాడుతుంది. 21 మంది ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడి అందరూ చనిపోయినా ఒకే ఒక వ్యక్తి బతికి బయటపడతారు. అతనే హీరో విక్రమాదిత్య. విక్రమ్ వేరు..ఆదిత్య వేరు. కానీ ఇద్దరూ ఒక్కరిలోనే ఉంటారు. దర్శకుడు చందూ మొండేటి ఒక్కరిలో ఇద్దరు మనుషులు...ఎడమ చేతికి ప్రత్యేక శక్తి అనే కొత్త కాన్సెప్ట్ ను అయితే బాగానే తీసుకున్నారు.

కానీ తాను పెళ్ళి చేసుకోవాల్సిన నాగచైతన్య అక్క భూమికను ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారనే ఏకైక కారణంతో విలన్ (మాధవన్) ఏకంగా 21 మందిని చంపాలనుకోవటం..ఆ బస్సు ప్రమాదంలో తప్పించుకున్న నాగచైతన్యను ఎలాగైనా అంతమొందించేందుకు ప్రయత్నించటం అనేది విలనిజానికి సంబంధించి పెద్ద వీక్ పాయింట్ గా మారింది. విలన్ గా మాధవన్ నటన సూపర్భ్ గా ఉందని చెప్పొచ్చు. అత్యంత సహజంగా..అలవోకగా తన పాత్రలో నటించారు మాధవన్. అయితే విలనిజం పండించటానికి అవసరమైన పాయింట్ లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది.

పస్టాఫ్ అంతా కామెడీతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ లో సినిమా సీరియస్ గా మారుతుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పొచ్చు. భూమిక పాత్ర చాలా పరిమితమే. సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కావటంతో సినిమా రిచ్ నెస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సూపర్ హిట్ అయిన నాగార్జున సినిమాలోని పాట ‘నిన్ను రోడ్డు మీద చూసింది లగాయతు’ అనే రీమిక్స్ పాట తప్ప..మిగతా పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. ఓవరాల్ గా చూస్తే ‘సవ్యసాచి’ ఓ టైమ్ పాస్ సినిమా.

రేటింగ్.2.5/5

Next Story
Share it