Telugu Gateway
Cinema

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్
X

బాహుబలి ప్రభావమో ఏమో కానీ..ప్రభాస్ సినిమాలు అంటే చాలా సమయం తీసుకుంటున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తమ హీరో కొత్త సినిమా కోసం చాలా కాలం వేచిచూడాల్సి వస్తోంది. అయితే ప్రభాస్ అభిమానులకు ఇది ఓ శుభవార్త. ఈ యువ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహో’ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్నట్లు పరిశ్రమ వర్గాల్లో టాక్. బాహుబలి తరహాలో ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే కావటం గమనార్హం. బాహుబలితో అటు దర్శకుడు రాజమౌళి ఇమేజ్..ఇటు హీరో ప్రభాస్ ఇమేజ్ కూడా ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి.

దీంతో తదుపరి చిత్రాల విషయంలో కూడా ప్రభాస్ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాహోను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలై ఈ సినిమా మేకింగ్‌ వీడియోకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it