ఫస్ట్ డే షూటింగ్ లో ‘ఆ ముగ్గురు’

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయింది. దర్శక దిగ్గజం రాజమౌళి షాట్ రెడీ..తారక్ అనటం..షూటింగ్ ప్రారంభం అయిన చిత్రాలను రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో ఇక నుంచి ఈ సినిమా అప్ డేట్స్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు..ఇటు చరణ్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఎదురుచూడటం ఖాయం. షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.అలాగే రాజమౌళి తొలి షాట్‌కు దర్శకత్వం వహిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. చరణ్ రెడీ, తారక్ రెడీ అంటూ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల కలయికలో రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే వార్తలు వెలువడినప్పటి నుంచి.. ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కైరా అద్వానీలు నటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
https://www.youtube.com/watch?v=AjHhTR8AZlY