Telugu Gateway
Telangana

ప్రచారం రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి

ప్రచారం రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన మూడు రోజుల ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరికీ ఇవ్వని రీతిలో రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ను కేటాయించి..పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిందిగా ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ఆయన తన ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కానీ మారుతున్న పరిణమాల నేఫథ్యంలో తనకు ప్రాణహాని ఉందని..తనను హత్య చేసేందుకు కొన్ని మావోయిస్టు గ్రూపులను దింపారని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా కూడా భద్రత పెంచటం లేదన్నారు. తన హోదా పెరిగినా భద్రత అలాగే ఉంచారని అన్నారు.

గురువారం నాడు కూడా రేవంత్ రెడ్డి ఎలాగైనా చేసి కొడంగల్ ఎన్నికలు వాయిదా వేసి..తర్వాత జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నివాసం ఉంటున్న ఇంట్లో ఏకంగా 17.5 కోట్ల రూపాయలు దొరికితే కేవలం 50 లక్షలు మాత్రమే అని చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించారంటూ పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైఖరిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన రేవంత్ రెడ్డి. కోర్టు దిక్కరణ పిటిషన్ ను శుక్రవారం నాడే కోర్టు విచారించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Next Story
Share it