Telugu Gateway

నిమిషాల్లో ఆరు లక్షల ‘రెడ్ మీ నోట్ 6 ప్రో’ పోన్ల సేల్

నిమిషాల్లో ఆరు లక్షల ‘రెడ్ మీ నోట్ 6 ప్రో’ పోన్ల సేల్
X

నిమిషాల్లో లక్షల అమ్మకాలు. ఎవరూ ఊహించిన రీతిలో డిమాండ్. ఫోన్ వాడకందార్ల నుంచి వస్తున్న డిమాండ్ ను అందుకునేందుకు కంపెనీయే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. సహజంగా ఏ ఉత్పత్తి అయినా మార్కెట్లో అందుబాటులో ఉన్నా అలా అమ్ముడు అవుతూ ఉంటాయి. కానీ ఈ రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్లు మాత్రం అలా అందుబాటులో పెట్టడం ఆలశ్యం. నిమిషాల్లో అలా మాయం అవుతున్నాయి. తాజాగా షామీ ‘రెడ్ మీ నోట్ 6 ప్రో’ ఫోన్లను ఫ్లాష్ సేల్ లో అమ్మకానికి పెట్టింది. అంతే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఆరు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ ఫోన్లను గురువారం నాడే దేశ రాజధాని ఢిల్లీలో విడుదల చేశారు. ఈ ఫోన్ ధర 13,999 రూపాయలు. ఫ్రైడే సేల్ కింద 12,999 రూపాయలకే అమ్మారు.

హెచ్ డీఎఫ్ సీ కార్డు దారులకు మరో 500 రూపాయల డిస్కౌంట్ ఇచ్చారు. ఈ ఫోన్లకు వచ్చిన డిమాండ్ తో కంపెనీ ఒక్క రోజులో పలుమార్లు ఫ్లాష్ సేల్స్ నిర్వహించింది. రికార్డు స్థాయిలో ఈ ఫోన్లు అమ్ముడుపోయిన విషయాన్ని సంస్థ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫోన్ నాలుగు కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఫోన్ వెనక భాగంలో 12 ఎంపీ, 5 ఎంపీతో కూడిన రెండు కెమెరాలు, ముందు భాగంలో 20 ఎంపీతో ఒకటి, 2 ఎంపీతో రెండు కెమెరాలు ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ ప్లే 6.26 అంగుళాలు ఉంటుంది.

Next Story
Share it