రవితేజకు జోడీగా ఆర్ఎక్స్ భామ
BY Telugu Gateway3 Nov 2018 11:21 AM GMT

X
Telugu Gateway3 Nov 2018 11:21 AM GMT
పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ సినిమాతోనే తెలుగులో సూపర్ మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా రవితేజకు జోడీ కట్టనుంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో తన నటనతో కుర్రకారు మనస్సు దోచుకుందీ భామ. ఏ సినిమా వస్తే వెంటనే ఆ సినిమాలను ఓకే చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.
వి. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించటానికి ఆమె అంగీకరించారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. రవితేజ హీరోగా నటించిన అమర్, అక్భర్ , అంటోని సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Next Story