Telugu Gateway
Cinema

11.11.11 కు ఎన్టీఆర్ రెడీ

11.11.11 కు ఎన్టీఆర్ రెడీ
X

ఈ లెక్కలేంటి అంటారా?. ఇదేమి కొత్త సినిమా టైటిల్ కాదులేండి?. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాకు ఖరారు చేసిన ముహుర్తం ఇది. 11 అంటే నవంబర్ 11, 11 పదకొండవ నెల..11 గంటలకు సినిమా ముహుర్తపు షాట్ కు అందరూ రెడీ అయిపోయారు. ‘RRR’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినమా తెరకెక్కనుంది. ముగ్గురి పేర్లు కలసి వచ్చేలా ఈ ఏర్పాట్లు చేశారు. వాళ్ల ముగ్గురే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.

బాహుబలి రెండు భాగాల తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి ప్రాజెక్టు ఇదే కావటంతో అందరికి దీనిపై భారీ అంచనాలు సహజం. అందునా ఇది మల్టీస్టారర్. కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నట్లు టాక్. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత దానయ్యే ఈ భారీ సినిమా నిర్మాత. కొత్త సినిమాకు ఎన్టీఆర్ కొత్త లుక్ లో కన్పించనున్నారు. హీరోయిన్లకు సంబంధించిన పేర్లు షూటింగ్ ప్రారంభం అయిన రోజు వెల్లడి కావొచ్చని భావిస్తున్నారు.

Next Story
Share it