Telugu Gateway
Andhra Pradesh

జగన్ కేసులో చంద్రబాబు ఆ లాజిక్ మిస్ అయ్యారే!

జగన్ కేసులో చంద్రబాబు ఆ లాజిక్ మిస్ అయ్యారే!
X

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకుని..సీబీఐ విచారణ, థర్డ్ పార్టీ విచారణ పేరుతో హైకోర్టును ఆశ్రయించగలరా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ జగన్ పై దాడి జరిగినప్పటి నుంచి అది అంతా డ్రామానే అని చెబుతోంది. అదే నిజం అయితే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడికి సంబంధించి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు?. తెలుగుదేశం నేతల వాదనే కరెక్ట్ అయితే ...ఆయన కానీ..ఆయన పార్టీ అభిమానులు ఎవరైనా నిజంగా దాడి చేయిస్తే ఆ విచారణలో జగన్ అండ్ టీమ్ ఇరుక్కుంటుంది కదా?. మరి అలాంటప్పుడు వైసీపీ అధినేత ఏకంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ ఎందుకు రాస్తారు? హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు?. ఏపీలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. హైకోర్టు విచారణ అయినా..ఎవరు విచారణ చేసినా ఆధారాలు ఇవ్వాల్సింది ఏపీ పోలీసులే. నిజంగా సీఎం చంద్రబాబు, మంత్రులు అందరూ ముక్తకంఠంతో చెబుతున్న విధంగా జగన్ తనపై తానే దాడి చేయించుకుని..దానిపై విచారణ చేయించుకుని కొత్త కేసులో ఇరుక్కోవాలని కోరుకుంటారా?. అలా ఎవరైనా చేస్తారా?.

ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీజీపీ ఠాకూర్ లు జగన్ పై దాడి చేసింది ఆయన అభిమానే అని ప్రకటించేశారు. ఇదే నిజం అయితే ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి విచారణ జరిపించి జగన్ ను మరో కేసులో ఇరికించే ఛాన్స్ కూడా ఉంది కదా?. మరి అలా ఎందుకు చేయటం లేదు?. జగన్ కోరినా థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు అంగీకరించటం లేదు?. జగన్ పై జరిగిన దాడి..అనంతర పరిణామాలు చూస్తుంటే..పలు అనుమానాలకు తావిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష నేత జగన్, వైసీపీ నేతల డిమాండ్లు..చంద్రబాబు మొదలుకుని అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు ‘సింక్’ కావటం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. అది ఏంటో ఎప్పుడు తేలుతుందో మరి?.

Next Story
Share it