Telugu Gateway

మూడేళ్ల బాలిక నోట్లో బాంబు పేల్చారు

మూడేళ్ల బాలిక నోట్లో బాంబు పేల్చారు
X

దారుణం జరిగింది. కొంత మంది యువకులు ఓ మూడేళ్ల బాలిక నోట్లో దీపావళి బాంబు పెట్టి పేల్చారు. దీంతో ఆ బాలిక తీవ్ర గాయాలతో ఇప్పుడు పోరాడుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. దీపావళి పండగ రోజే ఈ దారుణం జరిగింది. వెంటనే బాధిత బాలికను పోలీసులు ఆస్పత్రికి చేర్చారు. ఈ ప్రమాదంలో బాలికకు 50 కుట్లు పడగా..గొంతు కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Next Story
Share it