కాంగ్రెస్ కు షాక్

ఎన్నికల ముంగిట తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత చెరకు ముత్యంరెడ్డి పార్టీని వీడనున్నారు. ఆదివారం నాడు ఆయనతో మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆయనతో చర్చలు జరిపారు. ముత్యంరెడ్ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరటానికి సమ్మతించారు. ఇది కాంగ్రెస్ కు దుబ్బాకలో కోలుకోలేని దెబ్బే. ఈ సీటును కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి (టీజెఎస్)కు కేటాయించింది. హరీష్ తో భేటీ అయిన సందర్భంగా ముత్యంరెడ్డి కంటతడి పెట్టారు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ది వెనుక ముత్యం రెడ్డి శ్రమ ఎంతో ఉందని అన్నారు. ఆయన చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ బలం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకర్గంలో రామలింగారెడ్డిని ఓడించాలంటే ముత్యం రెడ్డిలాంటి నేతను బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన విషయం తెలిసిందే. దుబ్బాక బరిలో టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి పోటీలో నిలవగా..టీజేఎస్ నుంచి చిందం రాజ్‌కుమార్ బరిలో నిలిచారు.