2.ఓ వసూళ్ళ ధమాకా
రజనీకాంత్ సినిమా 2.ఓ వసూళ్ళ దమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సంచలన దర్శకుడు శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురువారం నాడే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణల్లో ఈ సినిమా 19 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇఫ్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా ఇదే కావటం విశేషం.
ఒక్క చెన్నయ్ నగరంలోనే 2.64 కోట్లు రాబట్టింది. తాజాగా విడుదలైన విజయ్ సర్కారు సినిమా తొలి రోజు చెన్నయ్ లో సాధించి వసూళ్ళు 2.37 కోట్ల రూపాయలు ఉన్నాయి. హిందీలో 25 కోట్లు, కర్ణాటకలో 8 కోట్ల వరకూ వసూళ్ళు వచ్చినట్లు లెక్క. ఇక విదేశీ మార్కెట్లలోనూ రజనీకాంత్ దుమ్మురేపాడు. తుది లెక్కలు వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుని తొలి రోజు వసూళ్ళు వంద కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా.