Telugu Gateway
Telangana

ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్

ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి మరో వికెట్ పడింది. ఎమ్మెల్సీ యాదవరెడ్డి పార్టీ మారేందుకు రెడీ అవటంతో ఆయనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో రంగం సిద్ధం చేసుకున్నారు. యాదవ రెడ్డి సోనియా సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా సోనియా సభలో అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

త్వరలోనే మరికొంత మంది కీలక టీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని వీడే నేతలను ముందుగానే గుర్తించే పనిలో పడింది. ఎన్నికల ముందు ఇలా పార్టీ నేతలు జంప్ అయితే నైతికంగా ఇబ్బంది అనే టెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఉంది.

Next Story
Share it