Telugu Gateway
Politics

కెసీఆర్ కు ఉత్తమ్ థ్యాంక్స్

కెసీఆర్ కు ఉత్తమ్ థ్యాంక్స్
X

ఓ వైపు హోరాహోరీగా ఎన్నికల పోరు. విమర్శలు..ప్రతి విమర్శలు. ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటారా?. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తనకేమీ కాదని..ఇంట్లో పండుకుని రెస్ట్ తీసుకుంటానని వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదేనని..ముందుగానే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11 తర్వాత కెసీఆర్ ఫాంహౌస్ కు, కెటీఆర్ కు వెళ్ళిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో ప్రజలు, నాయకులు విసిగిపోయారని, కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ప్రజల్లో ఉన్న ముసుగు తొలిగిపోయిందని, దోచుకోవడానికే అధికారాన్ని కోరుకుంటున్నారని ప్రజలకు అర్థమైందన్నారు.

ప్రజలు దృష్టి మరల్చడానికే కేసీఆర్ కూటమిపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సోనియా సభకు, టీజేఎస్‌, టీడీపీ, సీపీఐ క్యాడర్‌లను ఆహ్వానించామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ కూడా పాల్గొంటారని తెలిపారు. త్వరలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు.. కేటీఆర్‌ అమెరికాకు వెళ్తారని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎదురుచూస్తున్న వారికి గ్రాంట్‌ను రూ. 50 వేలు ఒకేసారి చెల్లిస్తామని, ఆ తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు. 30 రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని, పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపని, సమాన వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 28 న ఖమ్మం, తాండూరులో బహిరంగసభలు ఉంటాయన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వలేకపోయారో మురళీధర్రావు చెప్పాలని, ఈసారి ఒక్క సీటు కూడా బీజేపీకి రాదన్నారు.

Next Story
Share it