Telugu Gateway
Telangana

క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు ఎదురుగాలులు

క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు ఎదురుగాలులు
X

వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు..అత్యధిక శాతం ఓట్లు. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిత్యం చెబుతున్న మాటలు. ఈ మాటలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. పైగా పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఏకంగా తమ గ్రామాలకు రావాద్దంటూ కొన్ని చోట్ల అయితే అభ్యర్ధులను అడ్డుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్దుల ప్రచార రథాలకు ఉన్న పోస్టర్లు..ఫెక్సీలను చింపేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వాట్సప్ ల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి చందూలాల్ కు అసమ్మతి బెడద మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్ధుల మధ్య పోటీకంటే సమ్మతి..అసమ్మతి వర్గాల ఫైటింగే ప్రధానంగా వార్తల్లో కన్పిస్తోంది. హుస్నాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒడితెల సతీశ్‌కుమార్‌కు తాజాగా మరోసారి నిరసన సెగ తగిలింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ ఆయనను అడ్డుకున్నారు. ‘ఏమీ చేయని ఎమ్మెల్యే మా గ్రామంలోకి రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. మరో తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది పలు గ్రామాల్లో. చాలా చోట్ల అధికార పార్టీ అభ్యర్దులు ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాల పాలు అవుతోంది.

Next Story
Share it