Telugu Gateway
Cinema

పూజా హెగ్డె దూకుడు

పూజా హెగ్డె దూకుడు
X

టాలీవుడ్ లో పూజా హెగ్డె ఇప్పుడు దూకుడు మీద ఉంది. ఓ సినిమా పూర్తి చేయ‌టం ఆల‌శ్యం వెంట‌నే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టేస్తోంది. ఇప్పుడు ఈ భామ ప్ర‌భాస్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ప్ర‌భాస్ ఓ వైపు సాహో షూటింగ్ చేస్తూనే ...రాధాక్రిష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇట‌లీలో సాగుతోంది. ఫ‌స్ట్ డే షూటింగ్ లో వర్షం అంటూ ఓ ఫోటోను పూజా హెగ్డె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌భాస్, పూజా హెగ్డెలు న‌టిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది. పూజా హెగ్డె తాజాగా ఎన్టీఆర్ హీరోగా న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని..ప్ర‌భాస్ తో జాయిన్ అయింది. అర‌వింద స‌మేత అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it