Telugu Gateway
Cinema

అందుకే..ఆ ఛాన్స్ వ‌చ్చింది

అందుకే..ఆ ఛాన్స్ వ‌చ్చింది
X

నిత్యామీన‌న్. రొటీన్ సినిమాలు కాకుండా..వెరైటీ పాత్ర‌లు కోరుకునే వారిలో ఒక‌రు. ఆమె తెలుగులో చేసిన సినిమాలు త‌క్కువే అయినా అభిమానుల్లో మాత్రం ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. ఆమె న‌ట‌నే కాదు..మాట‌లు కూడా ప్ర‌త్యేకంగానే ఉంటాయి. లావుగా ఉన్నార‌నే సినిమాలు రావ‌టం లేదా? అని ప్ర‌శ్నిస్తే అంతే గ‌డ‌స‌రిగా స‌మాధానం ఇస్తారు. అలా ఉన్నందుకే ఇంత కీల‌క పాత్ర ఉన్న సినిమా ద‌క్కింద‌ని స‌మాధానం చెబుతారు. లావుగా ఉన్నందుకు ఏమీ ఫీల్ కావ‌టంలేద‌ని తేల్చేస్తారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను శాసించిన దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌నున్నారు నిత్యామీన‌న్ . ప్ర‌స్తుతం బ‌యోపిక్ ల సీజ‌న్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ కూడా వెండితెర‌పైకి రానుంది.

ఐర‌న్ లేడీ పేరుతో తెర‌కెక్కిస్తున్న జ‌య‌లలిత బ‌యోపిక్ లో ఆమె పాత్ర‌ను నిత్యామీన‌న్ పోషించ‌నున్నారు. ఈ విష‌యాన్ని నిత్యామీన‌న్ కూడా నిర్ధారించారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన గీత గోవిందం సినిమాలో కూడా నిత్యా ఓ పాత్ర‌ను పోషించారు. అస‌లు గీతా గోవిందంలో నిత్యామీన‌న్ ఉంద‌నే విష‌యం చాలా మంది సినిమా చూసే వ‌ర‌కూ తెలియ‌దు. సినిమాలో ఆమె పాత్ర‌ను చూడ‌గానే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన వాళ్లు ఎంద‌రో. మ‌రి జ‌య‌ల‌లిత పాత్ర నిత్య‌కు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it