సవ్యసాచిలో నాగార్జున రీమిక్స్ సాంగ్
అక్కినేని నాగచైతన్య సందడి చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని నవంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున సినిమాలో సూపర్ హిట్ అయిన పాటను రీమిక్స్ చేసి ఉపయోగించారు. ఈ పాట వీడియో టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఒరిజినల్ పాట లోని ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ట్యూన్ చేశారు.
పాటలో చైతూ, హీరోయిన్ నిధి అగర్వాల్ మూమెంట్స్ కూడా ప్రేక్షకుల్లో ఊపు తెచ్చేలా ఉన్నాయి. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమా దర్శకుడు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నియంత్రణ లేని ఎడమ చేయి అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
https://www.youtube.com/watch?v=cBj2cYpXorc