నిఖిల్ కు జోడీగా నివేదా థామస్
BY Telugu Gateway19 Oct 2018 11:06 AM IST
X
Telugu Gateway19 Oct 2018 11:06 AM IST
టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా నివేదా థామస్ కు ప్రత్యేక గుర్తింపు పొంది. ఎందుకంటే ఆమె కు దక్కిన పాత్రలు అలాంటివి. ఇప్పుడు ఈ భామ కుర్ర హీరో నిఖిల్ కు జోడీ కడుతోంది. ఈ కొత్త సినిమా పేరే ‘శ్వాస’. దసరా సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ ను లాంచనంగా ప్రారంభించారు. శ్వాస సినిమాకు కిషన్ కట్టా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ముద్ర’ షూటింగ్ జరుపుకుంటోంది.
Next Story