Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ నేత దుర్మరణం

టీడీపీ నేత దుర్మరణం
X

తెలుగుదేశం సీనియర్ నేత, గీతం వర్శిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అమెరికాలో జరిగిన ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీ వద్ద మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య , వీరమాచినేని శివ ప్రసాద్, వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆంకరేజ్‌ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story
Share it