Telugu Gateway
Top Stories

టీ20 నుంచి ధోనీ ఔట్

టీ20 నుంచి ధోనీ ఔట్
X

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది ఓ అధ్యాయం. ఇప్పుడు ఆ అధ్యాయం ముగింపు దశకు చేరుకున్నట్లే కన్పిస్తోంది. తాజాగా ధోనీని క్రికెట్ బోర్డు టీ20 నుంచి కూడా దూరం చేసింది. మహేంద్ర సింగ్‌ ధోని భారత జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో ధోనికి చోటు ఇవ్వకుండా సెలక్టర్లు పరోక్షంగా తమ ఉద్దేశాన్ని చెప్పేసినట్లే కన్పిస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది.

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్, టి20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది. టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్‌ను న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగే తొలి అనధికారిక టెస్టు కోసం వెల్లడించారు. ఇంగ్లండ్‌ సిరీస్‌ మధ్యలో చోటు కోల్పోయిన మురళీ విజయ్, అంతకుముందే స్థానం లేని రోహిత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ ఎంపిక ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్య నిర్ణయాలు. వరుసగా రెండు టి20 సిరీస్‌లకు ధోనిని పక్కన పెట్టడం అంటే విశ్రాంతిగా భావించలేం కాబట్టి అతను ఇక వన్డేలకే పరిమితమైనట్లని భావిస్తున్నారు.

Next Story
Share it