Telugu Gateway

కొమ్మినేని శ్రీనివాసరావుకి పుత్ర వియోగం

కొమ్మినేని శ్రీనివాసరావుకి పుత్ర వియోగం
X

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష సోమవారం నాడు కెనడాలో మరణించారు. శ్రీహర్ష వయస్సు 32 సంవత్సరాలే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమారుడికి సీరియస్ గా ఉండటంతో కొద్ది రోజుల క్రితమే కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా కెనడా చేరుకుని కుమారుడి దగ్గరే ఉన్నారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవటంతో శ్రీహర్ష తుది శ్వాస విడిచారు. పుత్రశోఖంలో మునిగిన కొమ్మినేనిని పలువురు ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు. కొమ్మినేని శ్రీనివాసరావు తన కుమారుడి దగ్గరకు వెళ్లినుందనే సాక్షిలో ఆయన నిర్వహించే కెఎస్ఆర్ లైవ్ షోను వేరే వాళ్ళు చేపట్టారు.

Next Story
Share it