బూతులే కెసీఆర్ బలమా!

తెలంగాణ ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏమి సందేశం పంపించదలచుకున్నారు?. అసెంబ్లీలో ఎవరైనా ఒక్క మాట కాస్త పరుషంగా మాట్లాడితే కొత్తగా వచ్చిన రాష్ట్రం..కొ్త్త సంప్రదాయాలు నెలకొల్పుదాం. దేశానికే ఆదర్శంగా నిలుద్దాం అంటూ అడ్డుపడేవారు. నిజంగానే అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు లేకుంటేనే సభకు గౌరవం..సభలో ఉన్నవారికీ గౌరవమే. ఉద్యమ సమయంలో పరుషమైన వ్యాఖ్యలు చేసి..అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నేతలు...అధికారంలోకి రాగానే..అసలు అలా మాట్లాడటమే మహానేరం. ఘోరం అనే రీతిలో స్పందించేవారు. మరి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కెసీఆర్ భాషను తెలంగాణ సమాజం ఆమోదిస్తుందా?. చంద్రబాబుతో, కాంగ్రెస్ తో రాజకీయంగా కెసీఆర్ ఎంతైనా విభేదించవచ్చు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు ఎలా నష్టమో చెప్పొచ్చు. ఎవరి వాదన వారు చెప్పుకుంటారు. అంతిమంగా ప్రజలే తీర్పిస్తారు. కానీ బహిరంగ సభల్లో..తెలంగాణ సమజంతా అంతా చూస్తుండగానే ప్రత్యర్ధి పార్టీలపై అంతగా తిట్టాల్సిన అవసరం ఉందా?. తిడితేనే రాజకీయమా?. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను తిట్టారని ప్రతి సభలో చెప్పుకుంటున్న కెసీఆర్..పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై అలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవచ్చా?. శుక్రవారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తిలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....
కాంగ్రెసోళ్లను అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ అయి రాలేదంటరు. ఎందుకొచ్చిర్రు..పీకనొకిచ్చర్రా?
ఏమిరా చంద్రబాబునాయుడూ.
నీతో పొత్తా..ఛీ ఛీ నీది ఐరల్ లెగ్. నీవు కాలుపెడితే పచ్చటి చెట్లు కూడా మాడిపోతాయి.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు.