Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్
X

ఎన్టీఆర్ గా బాలకృష్ణ. హరికృష్ణగా కళ్యాణ్ రామ్. ఈ బయోపిక్ లో కొత్తగా కళ్యాణ్ రామ్ వచ్చిచేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రోజుకో కొత్త స్టార్ తో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అందరిలో అంచనాలు భారీగా పెంచేస్తోంది. ఎన్టీఆర్ జీవిత గాథను రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు)గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నారు. తన లుక్‌ను రిలీజ్‌ చేస్తూ... ‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Next Story
Share it