Telugu Gateway
Cinema

చదువు మర్చిపోతాం..అమ్మాయిని మాత్రం మర్చిపోలేం

చదువు మర్చిపోతాం..అమ్మాయిని మాత్రం మర్చిపోలేం
X

‘గుర్తుంచుకోవాలి..గుర్తుంచుకోవాలి అని చదిదే చదువును మాత్రం మర్చిపోతాం. మర్చిమర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోం. అబద్దాలు చెపితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ..అమ్మాయిలు మాత్రం పడతారు’ ఇవన్నీ ‘హలో గురూ ప్రేమకోసమే సినిమా థియేట్రికల్ ట్రైలర్ లోనివే. ఈ ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఇందులో రామ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య వచ్చే సన్నివేశాలు..డైలాగులు సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయని చెప్పొచ్చు. టైటిల్ కూడా యూత్ ను ఆకట్టుకునేదే.

ఓ సూపర్ హిట్ సినిమా పాటలోని చరణాన్నే టైటిల్ గా పెట్టేశారు. ఈ సినిమా త్రినాథ్ రావు మక్కిన దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో డైలాగులు చిత్ర రేంజ్ ను తెలియజేస్తున్నాయి. రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల పర్ఫామెన్స్‌ తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Y-b2wPqWVgY

Next Story
Share it