Telugu Gateway
Offbeat

విమానాశ్రయాల్లో ఎంట్రీకి ‘ముఖ గుర్తింపు’ విధానం

విమానాశ్రయాల్లో ఎంట్రీకి  ‘ముఖ గుర్తింపు’ విధానం
X

దేశీయ విమానాశ్రయాల్లో త్వరలోనే కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. ఇక మీరు విమానాశ్రయంలోకి అడుగుపెట్టడానికి ముఖ గుర్తింపు (facial recognition) బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి తేనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇది దేశీయ విమానాశ్రయాల్లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇది నిర్భందం కాదు. ప్రయాణికులు ఇష్టపడితేనే ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. భారత ప్రభుత్వం ‘డిజి యాత్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది ముందుచూపుతో..భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధానం విదేశాల్లో అమల్లో ఉంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు ప్రస్తుతం చూపిస్తున్న గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేకుండా ముఖ గుర్తింపు పద్దతిలో నేరుగా విమానాశ్రయంలోకి అడుగుపెట్టవచ్చు.

అయితే దీనికి ముందు ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో అంతా డిజిటలైజ్ అవుతున్న తరుణంలో ఇది అత్యుత్తమ మార్గంగా కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ విమానయాన రంగం ప్రతి ఏటా పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. అందుబాటులోకి వస్తున్న నూతన మౌలికసదుపాయాలు..పెరుగుతున్న కనెక్టివిటితో ఏటా దేశీయ విమాన ప్రయాణికులతో పాటు..విదేశీ ప్రయాణికుల సంఖ్యలో కూడా చెప్పుకోదగ్గ పురోగతి కన్పిస్తోంది.

Next Story
Share it