Telugu Gateway
Cinema

దీపిక..రణవీర్ పెళ్లి ఫిక్స్

దీపిక..రణవీర్ పెళ్లి ఫిక్స్
X

ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఎప్పటి నుంచో దీపిక..రణవీర్ సింగ్ ప్రేమ వ్యవహారానికి సంబంధించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రెండు కుటుంబాల సమ్మతితో తమ పెళ్లి నవంబరు 14, 15వ తేదీల్లో మా వివాహ వేడుక జరగనుందని తెలిపారు. ఇన్నేళ్లుగా మాపై ప్రేమ కురిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రేమతో దీపికా- రణ్‌వీర్‌’ అంటూ బాలీవుడ్‌ భామ దీపికా పదుకోన్‌ తన పెళ్లి తేదీని ప్రకటించేశారు. తమ వివాహాన్ని ధ్రువీకరిస్తూ పెళ్లి కార్డును కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.

బాలీవుడ్‌ హాట్‌ కపుల్ల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్‌ దగ్గర ప్రస్తావించగా...‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్‌ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను’ అంటూ వివరణ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లి వార్తే కాకుండా..ఏకంగా కార్డును కూడా వెల్లడించారు.

Next Story
Share it