Telugu Gateway
Cinema

చిరు ఫ్యామిలీ వెరైటీ పార్టీ

చిరు ఫ్యామిలీ వెరైటీ పార్టీ
X

పార్టీలు పలు రకాలు. రొటీన్ పార్టీలకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వెరైటీ పార్టీ చేసుకుంది. అదే ‘హాలోవీన్’ పార్టీ. విచిత్ర వేషధారణలతో చిరు ఫ్యామిలీలోని సభ్యులందరూ ఈ పార్టీలో పాల్గొన్నారు. భయంకరంగా ఉండే దుస్తులు ధరించి..రకరకాల వేషధారణలతో వీరు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరు ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తున్నారు. ఈ హాలోవీన్ పార్టీలు అనేది పాశ్చాత్య సంస్కృతిలో ఓ భాగం. ఇప్పుడు ఈ ట్రెండ్ దేశంలో కూడా కన్పిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీ ప్రముఖులు ఇలాంటి పార్టీలలో పాల్గొంటుండటంతో సామాన్యుల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. చిరంజీవి, రామ్ చరణ్ తో సహా అల్లు కుటుంబాలు ఈ పార్టీలో పాల్గొన్నాయి.

ముఖ్యంగా కల్యాణ్ దేవ్‌, సాయిధరమ్ తేజ్ లతో పాటు మెగా డాటర్స్‌ సుస్మిత, శ్రీజ వింత మేకప్‌లతో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ పార్టీకి సంబంధించిన ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో కింద ఎంతో మంచి అత్తమ్మ..భయంకరమైన కోడలు..హాలోవిన్ పార్టీ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోతో పాటు ఫ్యామిలీ ఫోటోలు నెట్ లో హంగామా చేస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంతో బిజీగా ఉండగా చిరంజీవి సైరా నరసింహరెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it