Telugu Gateway
Andhra Pradesh

నవయుగా..మెగా మధ్యలో చంద్రబాబు!

నవయుగా..మెగా మధ్యలో చంద్రబాబు!
X

నదుల అనుసంధానమా.. దోపిడీ అనుబంధమా?

టెండర్లలో సర్కారీ గూండాగిరి

నదుల అనుసంధానమా?. నిధుల దోపిడీ అనుబంధమా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవయుగా, మెగా కు బాగా ‘కనెక్ట్’ అయ్యారు. ఏపీలో ఏ పెద్ద ప్రాజెక్టు చేపట్టినా ఈ రెండు సంస్థలే రావాలా?. అదేమి లెక్క. నిప్పు...పారదర్శకతకు మారు పేరు అయిన చంద్రబాబు పాలనలో ఇది ఎలా సాధ్యం అవుతుంది?. అంటే దోపిడీకి స్కెచ్ వేయటం. అందుకు అనుగుణంగా ముందుకు సాగటం. అసలు దేశంలో బడా బడా కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ ఎందుకు ఏపీలో వేల కోట్ల రూపాయల పనులు వద్దనుకుంటున్నాయి. కేవలం ఆ రెండు కంపెనీలే ఎందుకు బిడ్లు దాఖలు చేశాయి. అంటే ప్రభుత్వమే ‘గుండాగిరి’ చేయటం. ప్రీ బిడ్ సమావేశంలో తాము చెప్పిన కంపెనీలు కాకుండా ఎవరైనా బిడ్స్ దాఖలు చేశారంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో ఊహించుకోవచ్చు. గత నెలలో జరిగిన ప్రీ బిడ్ సమావేశంలోనే హాజరైన కాంట్రాక్టర్లకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అందుకు అనుగుణంగా అంతా జరిగిపోయింది. గోదావరి-పెన్నా అనుసంధానం పనులకు సంబంధించి కేవలం నవయుగా, మెగా ఇంజనీరింగ్ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. రెండు ప్యాకేజీలకు ఈ రెండు సంస్థలే బిడ్స్ దాఖలు చేయటంతో చెరి ఒక పని కేటాయిస్తారని సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి.

2100 కోట్ల రూపాయలతో చేపట్టబోయే తొలి ప్యాకేజీ పనులు నవయుగాకు, 2500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన 2500 కోట్ల రెండవ ప్యాకేజీ మెగాకు దక్కటం ఖాయం అని సాగునీటి శాఖ వర్గాలు చెబుతున్నాయంటే ‘కుమ్మక్కు’ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. అంచనాలు అడ్డగోలుగా పెంచేసి ఈ రెండు ప్యాకేజీల ద్వారా చంద్రబాబు అండ్ కో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల దోపీడీకి స్కెచ్ వేశారంటే ఏపీలో అడ్డగోలు దందా ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. ఇటీవలే పదవి విరమణ చేసిన సీఎస్ దినేష్ కుమార్ అన్ని పనులు మెగా, నవయుగా వంటి ఎంపిక చేసిన సంస్థలకే ఎందుకు వెళుతున్నాయి. ఇది ‘కుమ్మక్కు’ కాదా? అని ప్రశ్నించారు. దీంతో ఏకంగా ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన ఉండే హైపవర్ కమిటీకి చెల్లుచీటి ఇఛ్చేసి..అస్మదీయులతో తూతూ మంత్రపు కమిటీని వేసుకున్నారు. ఇక ప్రభుత్వం చెప్పిందే అక్కడ వేదం అన్న మాట.

Next Story
Share it