Telugu Gateway
Cinema

అనుష్క పెట్టిన ఆ ఫోటోకు అర్థమేంటి?!

అనుష్క పెట్టిన ఆ ఫోటోకు అర్థమేంటి?!
X

బాహుబలి భామ అనుష్క ఈ మధ్య ఎక్కడా హడావుడి చేయటం లేదు. కొత్త సినిమాల ప్రకటన లేదు. దాదాపు దశాబ్దానికి పైగా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన స్వీటి అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు పెద్ద చర్చను లేవదీసింది. ఈ ఫోటో అర్థం త్వరలోనే అనుష్క పెళ్ళి పీటలు ఎక్కనుందా?. అభిమానులు ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణం ఆ ఫోటో కింద స్వీటి పెట్టిన క్యాప్షన్ కూడా ఓ కారణమే. ఆకులను కాలిమెట్టెలుగా పెట్టుకున్నట్లు ఉన్న ఫోటోను అనుష్క శెట్టి షేర్ చేశారు. అంతే కాదు..దీనికి క్యాప్షన్ అవసరం లేదు అనే క్యాప్షన్ పెట్టడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎక్కువ మంది నెటిజన్లు ఇది పెళ్ళికి సంకేతమే అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటో అనుష్క అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే అది పెట్టిన కొద్ది వ్యవధిలోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి. నవంబర్ 7న ఈ అందాల భామ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఆ రోజే తన పెళ్లి గురించి ప్రకటన చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. భాగమతి సినిమా తర్వాత ఇంత వరకూ అనుష్క ఒక్క కొత్త సినిమాను కూడా అంగీకరించలేదు. గత కొంత కాలంగా ఆమె పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో పడ్డారు. అది పూర్తయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా?. లేక పెళ్లి పీటలు ఎక్కుతారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it