Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆల్ ఫ్రీ..లోకేష్!

0

చందూ సాఫ్ట్ టెక్నాలజీస్ పై అంత ప్రేమఎందుకో?

‘కోట్ల రూపాయల విలువ చేసే భూమి లక్షలకే ఇచ్చేస్తాం. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ సబ్సిడీ కూడా మాదే. మీరు ఉద్యోగులను నియమించుకుంటే వారికి శిక్షణా సహాయం కింద లక్షలకు లక్షలు అందిస్తాం. భూమి ఇవ్వని కంపెనీలకు లీజు రెంటల్ సబ్సిడీ కూడా సర్కారే అందిస్తుంది. అంటే ఐటి కంపెనీలు అలా వచ్చి వ్యాపారం చేసుకుని ఎంచక్కా లాభాలు పొంది వెళ్ళొచ్చు. ఇదీ ఏపీ సర్కారు తీరు. చిన్నా చితకా కంపెనీలను తెస్తూ వాటికి కూడా భారీ ఎత్తున రాయితీలు..ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఓ కంపెనీకి సర్కారు ఇఛ్చిన రాయితీలు చూస్తే పలు అనుమానాలు తలెత్తతున్నాయి. అదే చందూ సాఫ్ట్ టెక్నాలజీస్. మేధా టవర్స్ లో ఈ కంపెనీ ఉన్నట్లు ఐటి శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఈ సంస్థకు ఓ సారి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ సబ్సిడీ కింద 50,740 రూపాయలు చెల్లించారు. ఇదే సంస్థకు లీజు రెంటల్ సబ్సిడీ కింద 4,33,844 రూపాయలు, రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ అసిస్టెన్స్ కింద 20,00,000, పెర్మాన్సెన్స్ లింక్డ్ గ్రాంట్ కింద 17,30,807 చెల్లించారు.

- Advertisement -

మరోసారి లీజు రెంటల్ సబ్సిడీ కింద 5,00,000, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ సబ్సిడీ కింద 15946 రూపాయలు, ఫెర్మార్మెన్స్ లింక్డ్ గ్రాంట్ కింద 43,07,565 రూపాయలు, రెంటల్ సబ్సిడీ కింద 6,07,101 రూపాయలు చెల్లించారు. చివరి ఒక్కటి మాత్రమే చెల్లించాల్సి ఉంది. మిగిలిన మొత్తం చెల్లింపులు పూర్తి చేశారు. ఒక్క చందూసాఫ్ట్ టెక్నాలజీస్ సంస్థకే వివిధ ఖాతాల కింద కోటి రూపాయలకు పైగా చెల్లింపులు చేశారు. మరో నాలుగైదు కంపెనీలకు రాయితీలు ఇఛ్చినా అది ఒక్క అంశానికే పరిమితం అయింది. కానీ చందూసాఫ్ట్ టెక్నాలజీస్ బ్యాండ్ విడ్త్ దగ్గర నుంచి అన్నీ సర్కారే సమకూర్చింది. అంటే కంపెనీ ప్రభుత్వ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నది అన్న మాట. ఇది ఎవరి కంపెనీ. ఐటి శాఖకు ఈ కంపెనీపై అంత ప్రత్యేక ప్రేమ ఎందుకు?

 

 

Leave A Reply

Your email address will not be published.