Telugu Gateway
Cinema

‘అర్జున్’పై శృతిహరహరన్ సంచలన ఆరోపణలు

‘అర్జున్’పై శృతిహరహరన్ సంచలన ఆరోపణలు
X

బహుభాషా నటుడు..ఒకప్పటి హీరో అర్జున్ చిక్కుల్లో పడ్డారు. అర్జున్ ఇప్పుడు పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాడు. ఇప్పుడు సడన్ గా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం కలకలం రేపుతోంది. అయితే ఈ ఆరోపణలపై అర్జున్ కూడా వెంటనే తీవ్రంగా స్పందించారు. న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. అర్జున్ ఆరోపణలతో ఈ ‘మీ టూ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. ఇప్పటికే పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడ నటి శృతి హరహరన్ కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్‌’ సెట్స్‌ లో (కన్నడలో ‘విస్మయ’) నటుడు అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ‘‘నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్‌ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్‌ చేసే చాన్స్‌ రాగానే ఎగ్జైట్‌ అయ్యాను. కానీ ‘విస్మయ’ సినిమా సెట్‌లో ఓ రొమాంటిక్‌ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలలో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది.

అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను’’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు శ్రుతీ హరిహరన్‌. అయితే ఈ ఆరోపణలపై సినిమా దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ స్పందించారు. ‘‘సినిమాలో ఏ సంఘటన గురించి అయితే ఇంత వివాదం జరగుతుందో ఆ సీన్‌ను నేను స్క్రిప్టింగ్‌ టైమ్‌లో చాలా రొమాంటిక్‌గా రాశాను. అది చదువుతున్నప్పుడే ‘నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్‌ లో నటించలేను’ అని అర్జున్‌ చెప్పారు. ఆయన కోరికే మేరకే ఆ సీన్‌లో రొమాంటిక్‌ ఫ్లేవర్‌ను తగ్గించాను. ఇప్పుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్‌ చేసిన ఆరోపణలు విని షాక్‌ అయ్యాను. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. మినిట్‌ టు మినిట్‌ నాకు గుర్తులేదు. ఈ సినిమా షూట్‌ టైమ్‌లో సెట్‌లో మేం చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. అర్జున్, శ్రుతీ ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు దర్శకుడు. ‘‘కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు మహిళలకు అన్ని చోట్లా సేఫ్‌ అండ్‌ సెక్యూర్డ్‌ సిచ్యువేషన్స్‌ ను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు.

Next Story
Share it