Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు లెక్క ప్రకారం..ఏసీబీ దాడులు ఉద్యోగులపై దాడులేనా?

చంద్రబాబు లెక్క ప్రకారం..ఏసీబీ దాడులు ఉద్యోగులపై దాడులేనా?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ల ‘లెక్క ప్రకారం’ అయితే అలానే కావాలి?. ఐటి దాడులు ఏపీపై దాడులు అయితే..మరి ఏసీబీ దాడులు ఉద్యోగులపై దాడుల కిందనే వారు పరిగణించాలా?. ఐటి దాడులపై చంద్రబాబు, లోకేష్ ల లాజిక్ కరెక్టే అయితే..ఏసీబీ దాడులు కూడా ఉద్యోగులపై దాడులగానే ఫరిగణించాల్సి ఉంటుంది?. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ నేతలు అందరూ ఐటి దాడులను ఏపీపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. అంతే కాదు..ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని తరహాలో ఏకంగా ఐటి అధికారులకు పోలీసు భద్రతకు కూడా ఉపసంహరిస్తామని ప్రకటించారు. అంతే కాదు..పెట్టుబడులను దెబ్బతీసేందుకే ఐటి దాడులు అంటూ ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అసలు ఐటి దాడులకు పెట్టుబడులకు సంబంధం ఏంటి? అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఈ లెక్కన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి నారా లోకేష్ లు ఏపీలో ఏ కంపెనీ దగ్గరైనా..ఏ నేత దగ్గర బ్లాక్ మనీ ఉన్నా..అక్రమార్జన ఉన్నా మా జోలికొస్తే ఇలాగే చేస్తామని హెచ్చరిస్తున్నారా?. ఇందుకు మీడియాను ఉపయోగించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

మంగళవారం నాడు ఏసీబీ అధికారులు ఏపీలో విద్యా శాఖకు చెందిన ఏడీ ప్రభాకర్ రావుపై దాడి చేశారు. ఏకంగా 82 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. గతంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరే వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు. మరి అప్పుడు ఏసీబీ దాడులు ఉద్యోగులపై దాడి అంటే చంద్రబాబు, లోకేష్ లు వాళ్ళను వదిలేస్తారా?. గతంలో చాలా మంది ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేసి వందల కోట్ల రూపాయల అక్రమార్జనను గుర్తించింది. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటి శాఖ అధికారులు దాడులు ఏపీపై జరిగిన దాడులు అయితే.. వందల కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన అధికారులపై ఏసీబీ దాడులు కూడా తప్పేనా?.

Next Story
Share it