Telugu Gateway
Cinema

‘ఆ యుద్ధం’ ఖర్చు 45 కోట్లా?!

‘ఆ యుద్ధం’ ఖర్చు 45 కోట్లా?!
X

కమర్షియల్ సినిమాలు వేరు. చారిత్రక సినిమాల కథ వేరు. వాణిజ్య చిత్రాల షూటింగ్ కు పెద్ద కష్టాలేమీ ఉండవు. కానీ చారిత్రక సినిమాలు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు..సినిమాకు కూడా అది పెద్ద ఎత్తున నష్టం చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే చారిత్రక సినిమా అంటే భారీ బడ్జెట్ ఉంటేనే బండి ముందుకు కదులుతుంది. లేదంటే చిక్కులే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక సినిమా ‘సైరా నరసింహరెడ్డి’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం ఒకటి చక్కర్లు కొడుతోంది.

అదేంటి అంటే ఈ సినిమాకు సంబంధించి ఒక్క యుద్ధం సీన్ కే ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమా బడ్జెట్ సుమారు 150 కోట్ల రూపాయలు అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ సినిమా నిర్మాత చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం సీన్ సినిమాలో కీలక సమయంలో వచ్చేది కావటం ఒకెత్తు అయితే.. అదే సమయంలో గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా భారీగా ఉండటంతో భారీగా ఖర్చు అవుతోందని చెబుతున్నారు. జార్జీయాలో చిత్రీకరించనున్న ఈ వార్‌ ఎపిసోడ్ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు కోసం పనిచేస్తున్నారు. ఈ చారిత్రక చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు.

Next Story
Share it