రాజమౌళి తనయుడి ప్రేమ..పెళ్ళి
BY Telugu Gateway6 Sep 2018 5:32 AM GMT

X
Telugu Gateway6 Sep 2018 5:32 AM GMT
రాజమౌళి. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ దర్శక దిగ్గజం ఇంట ఓ శుభకార్యం జరగనుంది. అదేంటి అంటే ..ఆయన తనయుడు కార్తికేయ ప్రేమ పెళ్లి. కార్తికేయ గాయని పూజా ప్రసాద్‌ను వివాహమాడనున్నాడు. వీరిద్దరూ కొత్తకాలంగా ప్రేమలో ఉన్నారు. కార్తికేయ, పూజల వివాహానికి రెండు కుంటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పూజ సీనియర్ నటుడు జగపతిబాబు అన్న రాం ప్రసాద్ కుమార్తె. ప్రస్తుతం రాజమౌళి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, సెకండ్ యూనిట్ దర్శకుడిగా ఉన్న కార్తికేయ పలు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖలు హజరయ్యారు.
Next Story