Telugu Gateway
Movie reviews

‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ

‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ
X

అల్లరి నరేష్. సునీల్. ఇద్దరిదీ ఒకటే పరిస్థితి. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేకుండా పరిశ్రమలో పెద్దగా కన్పించకుండా పోయారు. ఇద్దరు కామెడీ హీరోలను కలిపి తీసిన సినిమానే ‘సిల్లీ ఫెలోస్’. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా కూడా వారిద్దరికీ నిరాశే మిగిల్చింది. అత్యంత పాత చింతకాయ పచ్చడి కథతో ఇద్దరు హీరోలను పెట్టి సినిమా పూర్తి చేద్దామనుకున్న ప్రయత్నం ఘోరంగా ఫెయిలైంది. ఓ పాట పర్వాలేదనిపించినా..సినిమా మొత్తం ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టింది. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ పాత్రలు సినిమాకు పెద్ద తలనొప్పిగా మారాయి. కథలో ఏమైనా కొత్తదనం ఉందా? అంటే ఓ యాక్సిడెంట్ లో ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాష్ రెడ్డి గతం మర్చిపోవటం, మరో ప్రమాదంలో అది తిరిగి రావటం వంటి అరిగిపోయిన సీన్లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న అల్లరి నరేష్, సునీల్ లు చేసే పనులు కూడా ఏ మాత్రం ఆకట్టుకోవు.

తాను ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్ చిత్ర శుక్ల) వాసంతి కి పోలీసు ఉద్యోగం ఇప్పించే క్రమంలో అల్లరి నరేష్ వాళ్ల అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వాళ్లను నమ్మించే ప్రయత్నంలో భాగంగా డమ్మీ డీజీపీకి బ్రహ్మానందాన్ని తీసుకురావటం అంతా కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. సినిమాలో ఏ మాత్రం కొత్తదనం చూపించకుండా రొటీన్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. హీరోయిన్‌గా చిత్ర శుక్లా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్‌ చేశారు. ఓవరాల్ గా చూస్తే సిల్లీఫెలోస్ సినిమాకు వెళితే ‘బుక్కయిపోయినట్లే’!

రేటింగ్. 1.75/5

Next Story
Share it