Telugu Gateway
Cinema

స‌మంత సీరియ‌స్

స‌మంత సీరియ‌స్
X

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత నెటిజ‌న్ల‌పై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం భ‌ర్త అక్కినేని నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ పెట్టిన ఫోటోల‌పై వివాదం మొద‌లైంది. స‌మంత త‌న స‌ర‌దా ట్రిప్ ఫోటోల‌ను ఎప్ప‌టిలాగానే సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతే కొంత మంది నెటిజ‌న్లు ఆమె తీరుపై మండిప‌డ్డారు. ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు కామెంట్లు చేశారు. అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చాక ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవడం ఏంటి?.. డ్రెస్‌ బాగోలేదు.. వెంటనే ఫోటోను తీసేయ్‌.. అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ‘నేను పెళ్లి అయిన తరువాత ఎలా ఉండాలో చెబుతున్న వారందరికే ఇదే నా సమాధానం’ అంటూ.. మధ్య వేలు చూపిస్తూ ఉన్న ఫోటోను పోస్ట్‌చేశారు.

దీనిపైనా కొంతమంది నెటిజన్లు మండిపడగా, మరికొంత మంది సపోర్ట్‌ చేశారు. పెళ్లి అయిన త‌ర్వాత కూడా స‌మంత సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వ‌ర‌స హిట్లు ద‌క్కించుకుంటోంది. అయితే కొంత మంది మాత్రం నాగ‌చైత‌న్య ప‌క్క‌న పెట్టుకుని స‌మంత అలాంటి ఫోటోలు దిగితే ఆయ‌న‌కు లేని అభ్యంత‌రం నెటిజ‌న్ల‌కు ఎందుకు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇంతటితో అయినా ఈ వివాదం ఆగుతుందో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it